Showing posts with label Telugu Post. Show all posts
Showing posts with label Telugu Post. Show all posts

Thursday, May 28, 2009

పాక్ కి ఎంత బలం!

రెట్టింపైన అమెరికా ఆర్థికసాయం
ఏటా పాకిస్థాన్‌కు బుష్‌ హయాంలో ఇచ్చిన ఆర్థిక సాయాన్ని ఒబామా ప్రభుత్వం రెట్టింపు చేసింది. రాబోయే నాలుగేళ్లలో 9.1 బిలియన్‌ డాలర్లు (రూ.45,500 కోట్లు) ఆర్థిక సాయం అందించేందుకు కాంగ్రెస్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ద పాకిస్థాన్‌ ఎండ్యూరింగ్‌ అసిస్టెన్స్‌ అండ్‌ కో ఆపరేషన్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ (పీస్‌) చట్టాన్ని ఇటీవల అమెరికాలోని విదేశీ వ్యవహారాల కమిటీ మూజువాణీ ఓటుతో ఆమోదించింది.

Pasted from Andhra Jyothi Online edition

పాకిస్థాన్‌కు చైనా సాయం చేయాలి: యూఎస్

Web duniya, 27/05/09:

పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో పరిస్థితులపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో తాలిబాన్ తీవ్రవాదులను అణిచివేసేందుకు పాకిస్థాన్ మిలటరీ సైనిక చర్య చేపట్టిన సంగతి తెలిసిందే. గత కొన్నివారాలుగా ఇరువర్గాల మధ్య జరుగుతున్న భీకర పోరు కారణంగా వేలాది మంది పౌరులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

ఈ నేపథ్యంలో అమెరికా అధికారిక యంత్రాంగం పెరుగుతున్న తీవ్రవాదం నుంచి పెరుగుతున్న ఎదుర్కునేందుకు పాకిస్థాన్‌కు చైనా శిక్షణ, మిలటరీ పరికరాలు అందజేయాలని విజ్ఞప్తి చేసింది.

పాక్‌లో సుస్థిరతను తీసుకురావడంలో దాని మిత్రదేశాలను కూడా భాగస్వాములను చేయాలని ప్రతిపాదనలో భాగంగా అమెరికా తాజాగా ఈ విజ్ఞప్తి చేసింది. ఈ చర్యలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇటీవల వారాల్లో పాక్, ఆఫ్ఘనిస్థాన్‌లకు అమెరికా ప్రత్యేక రాయబారిగా నియమితులైన రిచర్డ్ హోల్‌బ్రూక్ పాక్ మిత్రదేశాలైన చైనా, సౌదీ అరేబియాల్లో పర్యటించారు.