ఏటా పాకిస్థాన్‌కు బుష్ హయాంలో ఇచ్చిన ఆర్థిక సాయాన్ని ఒబామా ప్రభుత్వం రెట్టింపు చేసింది. రాబోయే నాలుగేళ్లలో 9.1 బిలియన్ డాలర్లు (రూ.45,500 కోట్లు) ఆర్థిక సాయం అందించేందుకు కాంగ్రెస్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ద పాకిస్థాన్ ఎండ్యూరింగ్ అసిస్టెన్స్ అండ్ కో ఆపరేషన్ ఎన్‌హాన్స్‌మెంట్ (పీస్) చట్టాన్ని ఇటీవల అమెరికాలోని విదేశీ వ్యవహారాల కమిటీ మూజువాణీ ఓటుతో ఆమోదించింది.
Pasted from
పాకిస్థాన్‌కు చైనా సాయం చేయాలి: యూఎస్
Web duniya, 27/05/09:
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో పరిస్థితులపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో తాలిబాన్ తీవ్రవాదులను అణిచివేసేందుకు పాకిస్థాన్ మిలటరీ సైనిక చర్య చేపట్టిన సంగతి తెలిసిందే. గత కొన్నివారాలుగా ఇరువర్గాల మధ్య జరుగుతున్న భీకర పోరు కారణంగా వేలాది మంది పౌరులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
ఈ నేపథ్యంలో అమెరికా అధికారిక యంత్రాంగం పెరుగుతున్న తీవ్రవాదం నుంచి పెరుగుతున్న ఎదుర్కునేందుకు పాకిస్థాన్‌కు చైనా శిక్షణ, మిలటరీ పరికరాలు అందజేయాలని విజ్ఞప్తి చేసింది.
పాక్‌లో సుస్థిరతను తీసుకురావడంలో దాని మిత్రదేశాలను కూడా భాగస్వాములను చేయాలని ప్రతిపాదనలో భాగంగా అమెరికా తాజాగా ఈ విజ్ఞప్తి చేసింది. ఈ చర్యలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇటీవల వారాల్లో పాక్, ఆఫ్ఘనిస్థాన్‌లకు అమెరికా ప్రత్యేక రాయబారిగా నియమితులైన రిచర్డ్ హోల్‌బ్రూక్ పాక్ మిత్రదేశాలైన చైనా, సౌదీ అరేబియాల్లో పర్యటించారు.
No comments:
Post a Comment